Header Banner

హైడ్రా కమిషనర్ రంగనాథ్ దుండగులకు సీరియస్ వార్నింగ్! అమీన్‌పూర్ ముంపు బాధితులపై...!

  Sun Mar 02, 2025 17:10        Exclusives

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ఈసారి లాయర్‌కో, అక్రమంగా నిర్మాణాలు చేపటుడుతున్న అక్రమార్కులకో కాదు.. అమాయకుల నుంచి అన్యాయంగా డబ్బులు దండుకుంటూ కొత్త దందాలకు తెరలేపిన దుండగులకు గట్టి వార్నింగే ఇచ్చారు. అమీన్ పూర్ చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో దందాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున వస్తున్న ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన రంగనాథ్.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.

 

ఇది కూడా చదవండి: దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!


చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా.. అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారింది. అయితే.. హైడ్రాను బూచిలా చూపి.. కొంత మంది కొత్త దందాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ విషయంలో అయోమయం నెలకొనగా.. దాన్నే ఆసరాగా చేసుకుని అమాయకులను మరింత భయపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. అమీన్‌పూర్ చెరువు ఎఫ్టీఎల్ స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ పేరుతో జరుగుతున్న దందాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ పేరుతో.. కొంతమంది దందాల‌కు పాల్పడుతున్నారని.. ర‌సీదులు, వాట్సాప్ మెస్సెజ్‌ల ఆధారాలతో సహా స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన రంగనాథ్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ద చెరువు ఎఫ్టీఎల్ నిర్ధార‌ణ‌పై హైడ్రా చేస్తున్న క‌స‌ర‌త్తును ఆస‌రాగా తీసుకుని.. ఎవ‌రైనా దందాల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలు తప్పవని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.

 

నీట మునిగిన లే ఔట్ ప్లాట్లను కాపాడేందుకు ఖ‌ర్చు అవుతుంద‌ని ఎవ‌రైనా దందాలు చేస్తే వారి ప‌ట్ల ప్రజ‌లు అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు. దందాల‌కు పాల్పడుతున్న వారిపై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని బాధితుల‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలాంటి వారిపై హైడ్రా నుంచి కూడా కేసులు పెట్టాల‌ని అధికారుల‌ను రంగనాథ్ ఆదేశించారు. అమీన్‌పూర్ చెరువులో నీట మునిగిన ప్లాట్ల య‌జ‌మానులు ఎవ‌రినీ ఆశ్రయించాల్సిన ప‌ని లేద‌ని రంగనాథ్ స్పష్టం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #HydraCommissioner #RanganathWarning #AmeenpurFloodVictims #IllegalActivities #StrictAction #MumpuVictims #AmeenpurCheeru #HydraAction #LegalWarning #NoMercy